సీఆర్పీఎఫ్ జవాన్ శవపేటికను మోసిన రాజ్ నాథ్ సింగ్!

  • ఉగ్రదాడిలో 40 మందికి పైగా అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లు
  • బద్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపుకు వెళ్లిన రాజ్ నాథ్
  • డీజీపీ దిల్బాగ్ సింగ్ తో కలసి శవపేటికను మోసిన కేంద్ర హోంమంత్రి
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్ కు వెళ్లారు. బద్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ఓ అమరవీరుడి శవపేటికను భుజాలపై మోశారు. రాజ్ నాథ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ లతో పాటు ఇతర అధికారులు శవపేటికను మోసి, అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ విషణ్ణ వదనంతో కనిపించారు. మరోవైపు 'వీర్ జవాన్ అమర్ రహే' అనే నినాదాలతో సీఆర్పీఎఫ్ క్యాంప్ మారుమోగింది.

Go Back to Shorts
rajnath singh
budgam
Jammu And Kashmir
mortal
crpf

More Telugu News